పారాసిటమాల్ తో కరోనా తగ్గేట్టయితే సీఎం యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు?

Vijayashanthi: తెలంగాణ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు.

Arun Chilukuri
Published on: 3 July 2021 6:17 PM IST
Vijayashanthi Comments On CM KCR Over Vaccination in Telangana
X

విజయశాంతి

Vijayashanthi: తెలంగాణ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. కరోనా విషయంలో సీఎం పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కరోనా వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలని చెబుతున్న సీఎం కేసీఆర్ తనకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు? అని ఆమె నిలదీశారు.

కరోనా సోకినప్పుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఉంటే బాగుండేదని వ్యంగ్యం ప్రదర్శించారు. కోవిడ్‌పై బాధ్యత లేకుండా వ్యవహరించడంతోనే ఎంతో మంది మృత్యువాత పడ్డారని ఆరోపించారు. జుబ్లీహిల్స్‌ శ్రీరామ్‌ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయశాంతి పరిశీలించారు. వ్యాక్సినేషన్ సెంటర్‌లో సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story