Telangana News: విజయ డెయిరీ రైతులకు గుడ్‌న్యూస్‌

Telangana News: విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 4:51 PM IST
Vijaya Dairy Hikes Milk Procurement Prices
X

Telangana News: విజయ డెయిరీ రైతులకు గుడ్‌న్యూస్‌

Telangana News: విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. లీటర్‌ గేదె పాల ధర రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల్లోకి వచ్చిందని మంత్రి తలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story