Vidyasagar Rao: మాతృభాషా దినోత్సవానికి హాజరైన విద్యాసాగరరావు

Vidyasagar Rao: తెలుగు భాష కోసం జిల్లాకో పీఠం ఏర్పాటు చేయాలి

Rama Rao
Published on: 21 Feb 2022 6:07 PM IST
Vidyasagar Rao Attended the Mother Language Day in Hyderabad | TS News Today
X

 మాతృభాషా దినోత్సవానికి హాజరైన విద్యాసాగరరావు

Vidyasagar Rao: హైదరాబాద్ బేగంపేట లోని హరిత ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. అక్షరయాన్ కవయిత్రుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మాతృభాష కోసం కృషి చేసిన పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కనీసం మొదటి ఐదేళ్లయినా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు, తెలుగు కవులను ప్రోత్సాహించడానికి ప్రతి జిల్లాలో ఒక పీఠం పెట్టాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story