రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్‌కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో వెంకట్‌రెడ్డి?.. అగ్రనేతలతో వరుస భేటీలు?

Komatireddy Venkat Reddy: రాజగోపాల్‌ రెడ్డి వస్తే జిల్లాలో కాంగ్రెస్ బలపడుతుందన్న భావన?

Shekhar G
Published on: 23 Jun 2023 5:21 PM IST
Venkat Reddy In Efforts To Bring Rajagopal Reddy To The Congress
X

రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్‌కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో వెంకట్‌రెడ్డి?.. అగ్రనేతలతో వరుస భేటీలు?

Komatireddy Venkat Reddy: బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని..తిరిగి సొంతగూటికి తీసుకొచ్చేందుకు ఆయన బ్రదర్ వెంకట్ రెడ్డి పావులు కదుపుతున్నారా..? నల్గొండలో హస్తం పార్టీకి పుర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్న వెంకట్ రెడ్డి..తన తమ్ముడిని ఎలాగైనా పార్టీలో జాయిన్ చేసేందుకు ట్రై చేస్తున్నారా..? రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు తన అనుచరులతో డిస్కస్ చేస్తున్నారా..? హై కమాండ్ పెద్దలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ వెనుక ఆంతర్యం ఏంటి..?

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీని కలిసిన వెంకట్‌రెడ్డి తాజాగా కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తోనూ భేటీ అయ్యారు. అగ్ర నేతలతో భేటీలో ప్రధానంగా చేరికలపైనే చర్చించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. ముఖ్యంగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గురించి చర్చించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.. అయితే.. డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం శివకుమార్ ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. ఇక తెలంగాణ రాజకీయాల పైనా డీకేతో చర్చించానని..కొంత సమయాన్ని తెలంగాణకు కూడా కేటాయించాలని కోరినట్లు తెలిపారు వెంకట్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story