Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

Aadi Srinivas: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ఉదయం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2025 12:32 PM IST
Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
X

Aadi Srinivas: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ఉదయం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి సందర్శించారు. గృహ సముదాయం వద్ద ఉన్న బేస్‌మెంట్ నిర్మాణాన్ని నిల్చొని పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా కుంగిపోయింది.

ఈ ఊహించని పరిణామంతో అక్కడి అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకులు చురుకుగా స్పందించి, కింద పడిపోతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను పట్టుకోవడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story