Vegetables Price: మండుతున్న కూరగాయల ధరలు.. కొనుగోలు చేయలేక సామాన్యుడు విలవిల

Vegetables Price Hikes Double in Telangana
x

మండుతున్న కూరగాయల ధరలు

Highlights

*పేద, మధ్య తరగతిపై పెనుప్రభావం *రైతు బజార్లలోనే కిలో టమాటా ధర రూ.100 *బహిరంగ మార్కెట్‌లో రూ.70 పైనే కూరగాయల ధరలు

Vegetables Price: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూరగాయల ధరలు కొండెక్కాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో కూరగయాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడు.. కూరగాయల ధరలు సైతం ఆకాశాన్నంటడంతో విలవిలలాడుతున్నాడు. ఇక హైదరాబాద్‌లో కూరగాయాల నెలరోజుల్లోనే రెండితలయ్యాయి. రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న ధరలు సామాన్యుడికి వణుకు పుట్టిస్తున్నాయి. నగరంలోని రైతు బజార్‌లో సైతం 100రూపాయలకు పై గానే ధరలు ఉన్నాయంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతు బజార్లలోనే కిలో టమాట 140 రూపాయలకు విక్రయిస్తున్నారు. కయా, చిక్కుడు, క్యారెట్, కాకరకాయ ధరలు ప్రస్తుతం రైతు బజార్లో కిలో 60 నుంచి 70 రూపాయలు ఉన్నాయి. అటు బహిరంగ మార్కెటల్లో వీటి ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. గత నెల వరకు 20 ఉన్న ఆలూ.. రైతు బజార్‌లో 40 ఉండగా బహిరంగ మార్కెట్లో కిలో 60 వరకు పలుకుతోంది. ఇలా ఏది చూసినా బహిరంగ మార్కెట్లో కిలో 60 నుంచి 80 రూపాయలకు తక్కువగా ఉండటం లేదు. పెరుగుతున్న కూరగాయల ధరలు వంటగది బడ్జెట్‌ను పెంచుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.

రాష్ట్రంలో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల ఆరంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. చివరి వారానికి వచ్చేసరికి ధరలు రెండింతలు పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరి, పత్తి, వాణిజ్య, ఆరుతడి పంటలతోపాటు కూరగాయల పంటలనూ దెబ్బతీశాయి. ఉత్పత్తితోపాటు దిగుమతులూ తగ్గిపోవటంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. నగరంలోని రైతు బజార్‌లతో పాటు గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి మార్కెట్లలోనూ ధరలు మండిపోతున్నాయని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories