న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణ వేగవంతం

Arun Chilukuri
Published on: 28 Feb 2021 2:25 PM IST
న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణ వేగవంతం
X

న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణ వేగవంతం

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకు వాడిన కత్తులను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీను, చిరంజీవిని సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం సుందిళ్ల బ్యారేజ్‌ వద్దకు తీసుకువచ్చారు. కత్తులను ఎక్కడ విసిరారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైజాగ్‌ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు మూడు బృందాలుగా విడిపోయి కత్తులను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story