Sunitha Laxma Reddy: సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశాం.. దుష్ప్రచారం చేయడం సరికాదు

Sunitha Laxma Reddy: సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ సమస్యలపై మాట్లాడాం

Shekhar G
Published on: 24 Jan 2024 12:03 PM IST
Vakiti Sunitha Laxma Reddy Explained Why She Met CM Revanth Reddy
X

Sunitha Laxma Reddy: సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశాం.. దుష్ప్రచారం చేయడం సరికాదు

Sunitha Laxma Reddy: కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమైన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలను ఖండిస్తూ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ద్వారా స్పష్టత ఇచ్చారు. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశామని.. పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. తమ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పార్టీ మారే ఆలోచన లేదని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల్లో సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిసినట్లు వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story