Vajresh Yadav: వర్క్‌ బోర్డ్ సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం

Vajresh Yadav: వర్క్ బోర్డ్ సమస్య ఈ ప్రభుత్వం వచ్చాకే మొదలయింది

Shekhar G
Updated on: 26 Nov 2023 7:30 PM IST
Vajresh Yadav Comments On BRS Party
X

Vajresh Yadav: వర్క్‌ బోర్డ్ సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం

Vajresh Yadav: వర్క్ బోర్డ్ సమస్య కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వర్క్ బోర్డ్ సమస్య బాధితులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. బోడుప్పల్ ప్రాంత వాసి అయిన తనకు ఇక్కడి సమస్యలు తెలుసన్నారు. గతంలో ఎన్నడూ లేని వర్క్ బోర్డ్ సమస్య ఈ ప్రభుత్వం వచ్చాకే మొదలయిందన్నారు. కొంతమంది తమ స్వలాభం కోసం సమస్య పరిష్కారం అయిందని మిమ్మల్ని మభ్యపెడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కావాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story