Bhadrachalam: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం.. డిసెంబర్‌ 13నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

Bhadrachalam: ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ఈవో రమాదేవి

Shekhar G
Published on: 28 Nov 2023 6:55 PM IST
Vaikunta Ekadasi Uttara Dwara Darshanam at Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం.. డిసెంబర్‌ 13నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు 

Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో డిసెంబర్ 23న భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. డిసెంబర్‌ 13నుంచి ఉత్తర ద్వార దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాద్రి ఆలయ వెబ్‌సైట్‌లో టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు ఈవో తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం 2వేలు, వెయ్యి, ఐదు వందలు, 250 రూపాయల విలువైన సెక్టార్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story