Vaccination: తెలంగాణలో వేగంగా వ్యాక్సినేషన్‌

Vaccination: ఒక్కరోజులో 2లక్షల మందికి టీకా * శుక్రవారం 2,09,374 మందికి వ్యాక్సిన్

Sandeep Eggoju
Published on: 13 Jun 2021 9:37 AM IST
Vaccination: Vaccinate 2 Lakh People in one day in Telangana
X

వాక్సినేషన్ సెంటర్ (ఫైల్ ఇమేజ్)

Vaccination: కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. మొదట్లో స్లోగా నడిచిన వ్యాక్సిన్ డ్రైవ్ రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 2లక్షల 9వేల 374 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 654 ప్రభుత్వ కేంద్రాల్లో లక్ష 45 వేల 592 మంది టీకా వేయించుకున్నారు. ప్రైవేట్ లోని 47 కేంద్రాల్లో 63 వేల 782 మంది టీకా తీసుకున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా లక్ష 96వేల మంది తొలి డోసు, 12 వేల 487 మంది రెండో డోసు వేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాక 61 లక్షల 13 వేల 416 మంది మొదటి డోసు, 14 లక్షల 95 వేల 199 మంది రెండో డోసు వేసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story