Superspreaders: సూపర్‌ స్ప్రెడర్లకు 28 నుంచి వ్యాక్సిన్‌!

Vaccination for Superspreaders from 28th May
x

సీఎం కేసీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Super Spreaders: తెలంగాణలో కరోనాకు అడ్డకట్ట వేసేందుకు టీకా ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం.

Superspreaders: తెలంగాణలో కరోనాకు అడ్డకట్ట వేసేందుకు టీకా ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి, స్పెషల్ టీకా డ్రైవ్‌ చేపట్టేందుకు ప్లాన్ చేసింది. ఈమేరకు సూపర్‌ స్ప్రెడర్ల గుర్తింపు కోసం ప్రణాళికలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు వ్యాక్సినేషన్‌పై ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు.

ఈ నెల 28 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 30లక్షల మందిని సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మొదట జీహెచ్‌ఎంసీ పరిధిలోని సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆటో, క్యాబ్‌, బస్‌ డ్రైవర్లు, హోటళ్లు, సెలూన్ల సిబ్బంది, పూల, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, హమాలీలు, కిరాణా, మాంసాహార దుకాణదారులు, రేషన్‌ డీలర్లు, ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా సిబ్బంది, మద్యం దుకాణాల్లో అమ్మకందారులు తదితరులను సూపర్‌ స్ప్రెడర్లుగా ప్రభుత్వం గుర్తించింది.

మరోవైపు, ప్రైవేటు సంస్థల్లో టీకాకు వైద్య ఆరోగ్యశాఖ అనుమతిచ్చింది. తమ సిబ్బందికి పని ప్రదేశాల్లోనే టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. టీకాల కోసం ప్రైవేటు ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలని అధికారులు సూచించారు. అలాగే 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories