Vaccination: బ్యాంకు అధికారులకు, ఉద్యోగులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలని సీఎస్ ఆదేశం

Vaccination: తెలంగాణలో వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ సోమేష‌ కుమార్ అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2021 6:51 AM IST
Vaccination for Bank Employees Says CS Somesh Kumar
X

Vaccination: బ్యాంకు అధికారులకు, ఉద్యోగులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలని సీఎస్ ఆదేశం

Vaccination: తెలంగాణలో వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ సోమేష‌ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని సీఎం ఆదేశించారన్నారు. అక్టోబర్ నెల చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. మొదటి దశలో హై ఎక్స్ పోజర్ గ్రూప్స్‌‌కు వ్యాక్సిన్ అందించామని, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న వారికి దశల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టామని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోసులను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story