జానారెడ్డి నాయకత్వంలో ఆ సీట్ గెలుస్తాం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

X
Highlights
పీసీసీ ఎంపికపై అధిష్టానానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ సంధించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు...
Arun Chilukuri26 Dec 2020 11:50 AM GMT
పీసీసీ ఎంపికపై అధిష్టానానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ సంధించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు వద్దని ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ్‌నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి. జానారెడ్డి నాయకత్వంలో ఆ సీట్ తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ ఎంపికపై మాణికం ఠాగూర్ మరోసారి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను బీజేపీ వాడుకుంటోందని అన్న జగ్గారెడ్డి బలమైన లీడర్‌షిప్ ఉన్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని తెలిపారు.
Web TitleUttam Kumar should continue as TPCC chief till Nagarjunsagar by-poll: Jagga Reddy
Next Story