Uttam Kumar Reddy: దేశంలోనే రైతు రుణమాఫీ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

Uttam Kumar Reddy Slams State and Central Govt
x

Uttam Kumar Reddy: దేశంలోనే రైతు రుణమాఫీ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

Highlights

Uttam Kumar Reddy: తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

Uttam Kumar Reddy: తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయడం వల్ల అన్నదాతలు రోడ్డున పడ్డారని విరుచుకుపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ, ఆ తర్వాత మాటే మరిచిపోయారని ఉత్తమ్ ఆరోపించారు. మోదీ హయాంలో ఎరువుల ధరలు కూడా రెట్టింపయ్యాయన్నారు. ఇటు కేసీఆర్ హయాంలో కూడా రైతులు దగా పడ్డారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మిర్చి రైతులకు గిట్టుబాటు లేదన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతు బంధు పేరు చెప్పి అన్నింటినీ బంద్‌ చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పడం కోసమే ఈ సభా అని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మోదీ వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయందన్నారు. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఇది తొలిమెట్టు అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories