తెలంగాణలో పీఆర్సీపై కొనసాగుతోన్న రగడ

తెలంగాణలో పీఆర్సీపై కొనసాగుతోన్న రగడ
x

తెలంగాణలో పీఆర్సీపై కొనసాగుతోన్న రగడ

Highlights

*7.5శాతం ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేయడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం *హెచ్‌ఆర్‌ఏలో కోత పెట్టడంపైనా మండిపాటు *కనీసం 45శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటోన్న ఉద్యోగులు *రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఆందోళనలు *ఫిట్‌మెంట్‌... డీఏలా ఉందంటూ సెటైర్లు

తెలంగాణలో పీఆర్సీపై రగడ కొనసాగుతోంది. 7.5శాతం ఫిట్‌మెంట్‌కు పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అది పీఆర్సీ కమిషనా? లేక పిసినారి కమిటీనా అంటూ ఫైరవుతున్నారు. 7.5శాతం ఫిట్‌మెంట్‌‌‌‌పై అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కఠినంగా ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

పీఆర్సీ వివాదంపై ఉద్యోగ సంఘాలతో ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ చర్చలు జరిపింది. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా 7.5శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించాలని త్రిసభ్య కమిటీ సూచించింది. అయితే, తాము 45శాతం తక్కువ ఫిట్‌మెంట్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్లు యూటీఎఫ్ నేతలు తెలిపారు

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్‌) నిరంకుశ పాలన సాగిస్తున్నారని పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. కేసీఆర్‌ ఆదేశాలతోనే 7.5 శాతం ఫిట్‌మెంట్ నిర్ణయం జరిగిందని దుయ్యబట్టారు. 43 శాతానికి తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. హౌస్ అలవెన్స్ తగ్గించడం.. ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమేనన్నారు. తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేశాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని.. ప్రభుత్వంపై ఉద్యమించాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories