సీఎం కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు లేదు : ఉత్తమ్

రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి....
రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపటి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు ధాన్యాన్ని కొంటున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీతో సయోధ్య కుదుర్చుకుని వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనాల్సిందే అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 30వ తేదీ నుంచి జనవరి ఏడో తేదీ వరకు మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టి ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అంద చేస్తామని తెలిపారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతామని 18న రాష్ర్ట వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. మధ్యలో ఒక సారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT