Kollapur: తీవ్రనష్టాల్లో కొల్లాపూర్ మామిడి రైతులు.. అకాల వర్షాలతో నేలరాలిన కాయలు

Untimely Rains And Hail Damage About Of Mango Crop in Kollapur
x

Kollapur: తీవ్రనష్టాల్లో కొల్లాపూర్ మామిడి రైతులు.. అకాల వర్షాలతో నేలరాలిన కాయలు 

Highlights

Kollapur: ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు

Kollapur: కొల్లాపూర్ ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు స్దాయిలో మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం నాగర్‍ కర్నూల్‍ జిల్లా కొల్లాపూర్. ఇక్కడ పండించే పండ్లను విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత గల మామిడిని పండిస్తున్న రైతులు మాత్రం ప్రతీ ఏడాది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్ల క్రితం కరోనా కారణంగా ప్రారంభమైన వీరి కష్టాలు, నేటి అకాల వర్షాల వరకూ కొనసాగుతున్నాయి. ఈదురు గాలులకు సగం కాయ నేలరాలగా, ఉన్న కొద్దిపాటి కాయకు అధిక వర్షాలతో తెగుళ్ళు ఏర్పడి మామిడి రైతులకు తీవ్ర నష్టాలనే మిగిల్చాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న కొల్లాపూర్ మామిడి రైతులపై హెచ్‍ఎంటీవి ప్రత్యేక కథనం.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 22 వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 2 లక్షల 24 వేల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ప్రతిఏటా ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మంది మామిడి తోటలపై ఆధారపడి ఉపాధిపొందుతున్నారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించే వారు. ఇంత ప్రాచుర్యం ఉన్న ఇక్కడి మామిడి రైతులకు ఆశించిన స్దాయిలో లాభాలు రావటం లేదు. అనేక వడిదుడుకులు ఎదుర్కొని మామిడికాయలు పండించినా... అకాల వర్షాలకు చివరకు మామిడి రైతులు నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది.

వరుసగా మూడేళ్లు కరోనా కారణంగా పండిన మామిడిని అమ్ముకోలేని పరిస్ధితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈ ఏడాదైనా గట్టెక్కుదామని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఈ సారి వరుగా కురుస్తున్న అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్ర నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. కోత సమయంలో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు కొన్ని తోటల్లోని నేలరాలింది. మరి కొన్ని తోటల్లోని చెట్టుపైనే రకరకాల తెగుళ్లు సోకడంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ముఖ్యంగా కౌలు రైతులు అప్పులు ఊబిలో చిక్కుకు పోయారు.

అయితే కొల్లాపూర్ మామిడికి పూర్వవైభవం రావాలంటే ఇక్కడి మార్కెటింగ్, ఉద్యానవనశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం పాలమూరు జిల్లాను మామిడి క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories