Pralhad Joshi: ప్రధానికి ఆహ్వానం పలకలేని నీచ సంస్కృతి కేసీఆర్ ది..

Union Minister Pralhad Joshi Slams CM KCR
x

Pralhad Joshi: ప్రధానికి ఆహ్వానం పలకలేని నీచ సంస్కృతి కేసీఆర్ ది..

Highlights

Pralhad Joshi: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

Pralhad Joshi: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన ఆయన.. రాష్ట్రంలో తమ అసమర్థ పాలన, తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే కనీసి స్వాగతించలేని నీచ సంస్కృతి కేసీఆర్, కేటీఆర్ లదని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా సద్వనియోగం చేసుకోవడం లేదని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories