బాయిల్డ్ రైస్ పై భగభగలు.. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది...

Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో వరి వార్‌ కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 3 Dec 2021 8:30 PM IST
Union Minister Piyush Goyal Fires On TRS MPs Over Paddy Procurement
X

బాయిల్డ్ రైస్ పై భగభగలు.. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది...

Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో వరి వార్‌ కొనసాగుతోంది. రాజ్యసభలో కేకే ప్రశ్నకు రాజ్యసభలో పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. రబీలో బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే వస్తుందని, వాటిని తీసుకుంటారో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై వివరణ ఇచ్చిన పీయూష్‌ గోయల్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ లేఖ ఇచ్చిందని, ఇప్పుడు మీరెందుకు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు గోయల్.

తెలంగాణలో ప్రతి పంట పండుతుందని, రాష్ట్రంలో వరి ధాన్యం గణనీయంగా పెరిగిందని అన్నారు సురేష్‌రెడ్డి. పంట వేసే ముందు క్లారిటీ ఇవ్వకపోతే ఎలా అంటూ నిలదీశారు. పంట వేయకముందే కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు సురేష్ రెడ్డి. తెలంగాణ వరి ధాన్యం కేంద్రం కొంటుందా లేదా అనేది స్పష్టత ఇవ్వాలని లోక్‌సభలో డిమాండ్‌ చేశారు నామా. తెలంగాణ రైతాంగమంతా రోడ్డుపైనే ఉందని, ఒకవేళ బాయిల్డ్‌ రైస్‌ కొంటే ఎంత కొంటారో చెప్పాలని కోరారు నామా.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story