Piyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
Piyush Goyal: 40 వేల కోట్ల అంచనా లక్షా 30వేల కోట్లకు ఎలా పెరిగింది?
Piyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
Piyush Goyal: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎన్నో నిధులు విడుదల చేసిందని, అయితే తెలంగాణలో అవినీతి వల్ల నిధుల దుర్వినియోగం జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. 40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 30 వేల కోట్లకు పెంచడమే కేసీఆర్ హయాంలో అవినీతి ఎంతమేర జరిగిందో నిదర్శనమన్నారు. ఇంతటి అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టుల్లో కూడా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వహించిందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గోయల్ మీడియాకు వివరించారు.
Next Story




