Hyderabad: రేపు హైదరాబాద్ లో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన

Hyderabad: 2 జాతీయ రహదారులను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్న కేంద్ర మంత్రి గడ్కరీ

Rama Rao
Published on: 28 April 2022 5:35 PM IST
Union Minister Nitin Gadkari to Visit Hyderabad Tomorrow
X

రేపు హైదరాబాద్ లో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన

Hyderabad: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ఆయన రాష్ట్రంలోని రెండు నేషనల్ హైవేలను ప్రారంభించి జాతికి అంకింతం చేయనున్నారు. అనంతరం 7వేల 853 కోట్ల తో మొత్తం 354 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ లోని జీఎంఆర్ గార్డెన్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రొటోకాల్ ప్రకారం గడ్కరీకి ఆహ్వానం పంపేందుకు సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపారు. అయితే సీఎం కేసీఆర్ వెళ్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story