Mahendra Nath Pandey: బీజేపీ అధికారంలోకి వస్తే మూతబడ్డ పరిశ్రమలు పున:ప్రారంభిస్తాం

Mahendra Nath Pandey: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే టూర్

Rama Rao
Updated on: 13 Jun 2022 7:31 PM IST
Union Minister Mahendra Nath Pandey Tour in Nizamabad District
X

Mahendra Nath Pandey: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే టూర్

Mahendra Nath Pandey: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే. రెండురోజులుగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న కేంద్రం మంత్రి ఎంపీ అరవింద్ తో కలిసి బీజేపి కార్యాలయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్యాలు ప్రచారం చేసిన కాంగ్రెస్.. ఇపుడు సత్యాగ్రహ దీక్షలు చేయడం సిగ్గచేటన్నారు.

దేశ సేవకోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆయన గత8 ఏళ్లుగా ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నామన్నారు. కవిత ఎంపీ గా ఉన్నపుడు పసుపు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్న ఆయన. వ్యవసాయాధారిత పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీతో ఎవరికి ఏమీ నష్టం లేదన్న ఆయనన తెలంగాణ ప్రజలే నమ్మని కేసీఆర్ ను దేశ ప్రజలు నమ్మబోరన్నారు.

Rama Rao

Rama Rao

Next Story