Kishan Reddy: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Kishan Reddy: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దర్శించుకున్నారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2021 11:21 AM IST
Union Minister Kishan Reddy Visits Yadadri Temple
X

Kishan Reddy: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Kishan Reddy: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శనం అనంతరం వేద పండితులు కిషన్‌ రెడ్డికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story