భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి

Kishan Reddy: వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది

Rama Rao
Updated on: 15 Sept 2022 8:30 PM IST
Union Minister Kishan Reddy Visits Bhagyalakshmi Temple
X

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి

Kishan Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని వివరించారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో వందలాది మంది మహిళలతో కలిసి ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్‌రెడ్డి గత 75 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకోలేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story