Kishan Reddy: జీవవైద్య పరిశోధనలో హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు

Kishan Reddy: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టును సందర్శించిన కేంద్రమంత్రి

Jyothi
Published on: 17 Aug 2022 10:12 AM IST
Union Minister  Kishan Reddy Visited Hyderabad Genome Valley Project
X

Kishan Reddy: జీవవైద్య పరిశోధనలో హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు

Kishan Reddy: జీవవైద్య పరిశోధనలో హైదరాబాద్‌ ప్రపంచ గుర్తింపు సాధిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఆవరణలోని జాతీయ జంతు వనరులు, జీవవైద్య పరిశోధనాస్ధానాన్ని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఎలుకలనుంచి గుర్రందాకా జంతువనరులు, జీవవైద్య పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి జీవవైద్య పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని , హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ భవిష్యత్తులో అద్భుతాలను ఆవిష్కరించబోతోందన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచదేశాల పరిశోధనల్లో హైదరాబాద్ కీలక పాత్రపోషిస్తోందన్నారు.

Jyothi

Jyothi

Next Story