Kishan Reddy: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

* ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి * ప్రతి ఒక్కరూ కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 3:15 PM IST
Union Minister Kishan Reddy Visited Gandhi Hospital Today 23 08 2021
X

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ట్విట్టర్ ఫోటో)

Kishan Reddy: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. చివరి వ్యక్తి వరకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దేశ ప్రజలకు టీకాలు ఇచ్చిన తరువాతే ఇతర దేశాలకు పంపిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ విజృంభించకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story