సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

Union Minister Kishan Reddy Supervised The Arrangements At Secunderabad Parade Grounds
x

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

Highlights

Kishan Reddy: ఏర్పాట్లను పర్యవేక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్ గ్రౌండ్ కు ఇరువైపులా కాకతీయ కళా తోరణాలతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ ప్రాంగణంలో గోండు నృత్యాలు, ఒగ్గు డోలు, బతుకమ్మలు, బోనాలు, సన్నాయి మేళాలతో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. తెలంగాణ విమోచన ఉత్సవాల్లో కేంద్ర మంత్రులు పాల్గొననున్న దృష్ట్యా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories