Kishan Reddy: కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం..

Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 1 July 2022 9:30 PM IST
Union Minister Kishan Reddy Slams TRS Govt
X

Kishan Reddy: కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం..

Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోడీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామన్నారు. మోడీ రాక కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story