Kishan Reddy: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే

Kishan Reddy: ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసిన హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది ముమ్మటికి కమలం పువ్వు జెండానే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 20 Aug 2021 8:07 PM IST
Union Minister Kishan Reddy Slams CM KCR
X

Kishan Reddy: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే

Kishan Reddy: ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసిన హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది ముమ్మటికి కమలం పువ్వు జెండానే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం కేసీఆర్ కుటుంబం అంతా కలిసి, కుట్రలు, కుతంత్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈటల వెనకాల ప్రజలు, బీజేపీ అండగా ఉందన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి నేరుగా నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నీతి నిజాయితీతో పరిపాలన చేస్తున్నారని ఒక ధర్మకర్తగా పని చేస్తున్నారని కొనియాడారు. వరంగల్‌లో ప్రజా ఆశీర్వాద యాత్రను కొనసాగించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story