Kishan Reddy: మూసీ అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న ప్రభుత్వం

Kishan Reddy: మూసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Jyothi
Published on: 30 July 2022 12:12 PM IST
Union Minister Kishan Reddy Inspected Moosarambagh Bridge
X

Kishan Reddy: మూసీ అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న ప్రభుత్వం

Kishan Reddy: మూసీ అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మూసారాంబాగ్‌లోని మూసీ బ్రిడ్జిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. దేశంలో నూతనంగా నదీ జలాలపై రవాణా సౌకర్యం కోసం చేపట్టిన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ బృందాలు పర్యటించాయి కానీ ఇక్కడ మాత్రం నిర్మాణాలు చేపట్టలేదని పేర్కొన్నారు. అప్పులు మూసీ అభివృద్ధి కోసం చేసి కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి వదిలేసి దేశ రాజకీయాలు చేస్తానంటూ సీఎం కేసీఆర్ ఢిల్లీ చుట్టూ పర్యటన చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి వరదలు వస్తుంటే ప్రగతిభవన్, ఫార్మ్ హౌస్ దాటని ముఖ్యమంత్రికి నాలుగు రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే ప్రజలు ఉపేక్షించరన్నారు.

Jyothi

Jyothi

Next Story