తెలంగాణకు.. పీఎం కేర్స్ నిధికి..భారీ విరాళం ప్రకటించిన కిషన్ రెడ్డి

తెలంగాణకు.. పీఎం కేర్స్ నిధికి..భారీ విరాళం ప్రకటించిన కిషన్ రెడ్డి
x
Kishan Reddy (File Photo)
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి 50మండిపైగా మరణించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి 50మండిపైగా మరణించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన మంత్రి సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు.

పీఎం కేర్స్ కు కోటి రూపాయల విరాళం తో పాటుగా ఒక నెల వేతనాన్ని ఇస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు, తాను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు కరోనా పునరావాస కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇక దీనికి సంబంధించిన ఓ లేఖలను బుధవారం తెలంగాణ సీఎంకు, హైదరాబాద్ కలెక్టర్‌కు పంపారు. దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొందని ఈ లాంటి తరుణంలో ప్రజలు స్వచ్ఛందంగా తోచినంత సాయం పీఎం కేర్స్ విరాళాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories