సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

* ఫామ్‌హౌస్‌లో ఉంటూ కేంద్రంపై విమర్శలు తగవు * కుర్చీ కోసం, కుటుంబం కోసం కేసీఆర్‌ ఎంతకైనా దిగజారుతారు - కిషన్‌రెడ్డి

Sandeep Reddy
Published on: 20 Aug 2021 7:31 AM IST
Union Minister Kishan Reddy Fires on Telangana CM KCR About The Comments on Central Government
X

కిషన్‌రెడ్డి - కేసీఆర్‌ (ఫైల్ ఫోటో)

Union Minister Kishan Reddy: టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. సెక్రటేరియట్‌కు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కుర్చీ కోసం, కుమారుడి కోసం, కుటుంబం కోసం కేసీఆర్ ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు. ‌హుజురాబాద్‌లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్‌ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈటలకు బీజేపీ అండగా ఉందని చెప్పారు కిషన్‌రెడ్డి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story