Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
Kishan Reddy: చండూర్లో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
Kishan Reddy: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చండూరు సభలో సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలని చెప్పుకుంటున్న కేసీఆర్ వారు ఏపార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరేనని చురకలంటించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన కేసీఆర్‌కు బీజేపీని విమర్శించేస్థాయి లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం నిజమే అయితే ఫామ్ హౌజ్ లో పట్టుకున్న డబ్బులు ఎక్కడున్నాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు. ఇచ్చిన హామీలు మరిచిపోయిన కేసీఆర్ గెలిపిస్తే అభివృద్ది చేస్తామంటూ గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు.
Next Story




