Kishan Reddy: బీజేపీపై టీఆర్‌ఎస్ ధాన్యం గొడవకు కారణం.. హుజురాబాద్ ఎన్నికలే

Kishan Reddy: కుటుంబ పాలన, నియంత్రణ, పెత్తనం భరించలేక ఈటెల బీజేపీకి వచ్చారు

Rama Rao
Updated on: 27 March 2022 4:30 PM IST
Union Minister Kishan Reddy Comments on TRS | Telugu News Today
X

Kishan Reddy: బీజేపీపై టీఆర్‌ఎస్ ధాన్యం గొడవకు కారణం.. హుజురాబాద్ ఎన్నికలే

Kishan Reddy: బీజేపీపై టీఆర్‌ఎస్ ధాన్యం గొడవకు కారణం హుజురాబాద్ ఎన్నికలే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల తర్వాతనే ఈ సమస్య ఎందుకు వచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగైదు ఏళ్లుగా బాయిల్డ్ రైస్‌ను వినియోగించడంలేదని, తగ్గించుకుంటున్నారని చెప్పారు. 2014లో 3వేల 400 కోట్ల ధాన్యం, బియ్యం సేకరణకు ఖర్చు చేస్తే గతేడాది 26వేల 600 కోట్లు ధాన్యం, బియ్యం సేకరణకు కేంద్రం ఖర్చు చేసిందని గుర్తుచేశారు. అసలు బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదన్నారు కిషన్ రెడ్డి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం చివరి బియ్యపు గింజ కొంటామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కార్యాచరణ ఇవ్వలేదని చెప్పారు. ఎంత పంట పండుతుందో ఆ లెక్క రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటుందని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story