Kishan Reddy: తెలంగాణను అప్పుల పాల్జేసిన కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారు

Kishan Reddy: రైతులు వ్యవసాయబావులకు మీటర్లు పెట్టుకోవద్దు

Rama Rao
Published on: 12 Sept 2022 4:08 PM IST
Union Minister Kishan Reddy Comments On CM KCR
X

Kishan Reddy: తెలంగాణను అప్పుల పాల్జేసిన కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారు

Kishan Reddy: జాతీయ స్థాయిలో కుటుంబ పాలకులను ఏకంచేసి బీజేపీని ఎదుర్కొంటామనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలనాతీరుపై కిషన్ రెడ్డి నిప్పుులు చెరిగారు. చేతగాని తనంతో తెలంగాణను అప్పుల పాల్జేసిన కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకభావన కల్పిస్తున్న విషయాన్ని రైతులు గుర్తించి, వ్యవసాయ పొలాలవద్ద విద్యుత్ మీటర్ల పెట్టుకోవద్దని, కేసీఆర్ అవినీతికి మీటర్లు పెట్టి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story