Bandi sanjay: హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం

Bandi sanjay: మీ ఆస్తులకు మేం రక్షణగా ఉంటాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2024 2:23 PM IST
Union Minister Bandi Sanjay is furious over the demolition of Hydra
X

Bandi sanjay: హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం

Bandi sanjay: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలారా... మీ ఆయుధం మేమవుతామని.. మీ ఇళ్లపై బుల్డోజర్ దిగాలంటే.. ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలన్నారు. మీ ఆస్తులకు మేం రక్షణగా ఉంటామన్న బండి సంజయ్.. తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా..?.. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలనా అంటూ నిలదీశారు.

ప్రజలను వంచించడంలో బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా ఏముందని ప్రశ్నించారు. కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్ఎస్ సర్కార్ లాక్కుందని.. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై హైడ్రా దాడులు చేస్తోందన్నారు. హామీల అమలు, మాజీ సర్పంచ్‌ల బిల్లుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే అంటూ విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story