Amit Shah: మెజారిటీ సీట్లే టార్గెట్.. ఈనెల 24న తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్‌షా

Amit Shah: 10ఎంపీ స్థానాలు గెలవాలని తెలంగాణ నాయకత్వానికి టార్గెట్

Shekhar G
Published on: 20 Feb 2024 3:27 PM IST
Union Minister Amit Shah Will Visit Telangana on the 24th of this month
X

Amit Shah: మెజారిటీ సీట్లే టార్గెట్.. ఈనెల 24న తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్‌షా

Amit Shah: తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు సెగ్మెంట్ల వారిగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ పార్టీ చేపడుతున్న రథయాత్రలో షా పాల్గొంటారు. గత డిసెంబర్‌లో తెలంగాణలో పర్యటించిన షా...10ఎంపీ స్థానాలు గెలవాలని తెలంగాణ నాయకత్వానికి టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా 35శాతం ఓట్లను సాధించేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని 5 క్లస్టర్‌గా విభజించి బీజేపీ నేతలు రథయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story