హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌షా.. ఉజ్జయిని మహంకాళికి ప్రత్యేకపూజలు

Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 21 Aug 2022 3:10 PM IST
Union Minister Amit Shah Offers Special Prayers At Ujjaini Mahankali Temple
X

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌షా.. ఉజ్జయిని మహంకాళికి ప్రత్యేకపూజలు

Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌ షాకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్‌ స్వాగతం పలికారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌ అక్కడి నుంచి సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కళాసిగూడలోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి కాఫీ తాగనున్నారు. దాదాపు 30నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు. బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో ఆల్పాహారం చేసిన తర్వాత అక్కడి నుంచి బేగంపేటలోని రామ్‌ మనోహర హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ రైతుల సంఘాల నేతలతో సమావేశం అవుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story