Amit Shah: నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: రాత్రి 7.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు షా

Shekhar G
Published on: 16 Sept 2023 9:16 AM IST
Union Home Minister Amit Shah Is Coming To Hyderabad Today
X

Amit Shah: నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు బిహార్‌లోని దర్బాంగ్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి రాత్రి 7 గంటల 20 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు CRPF సెక్టార్‌ ఆఫీసర్‌ మెస్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొంటారు.

ముందుగా పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. ఆ తర్వాత మళ్లీ CRPF సెక్టార్ ఆఫీస్‌ మెస్‌కు చేరుకొని, రాష్ట్ర బీజేపీ లీడర్లతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనమవుతారు అమిత్‌ షా.

Shekhar G

Shekhar G

Next Story