హైదరాబాద్‌కు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Union Home Minister Amit Shah Arrived in Hyderabad Today
x

హైదరాబాద్‌కు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Highlights

*బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొననున్న అమిత్‌ షా

Amit Shah: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉన్నా నేతల పాదయాత్రలు, జాతీయ నేతల పర్యటనలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించగా తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో పార్టీ భవిష్యత్‌కు, వచ్చే ఎన్నికల లక్ష్యానికి ఈ సభ కీలకమని భావిస్తున్న కాషాయదళం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జన సమీకరణతో విజయవంతం చేసేందుకు శ్రమిస్తోంది. తుక్కుగూడలో జరిగే ఈ సభకు ప్రధాన వేదిక సహా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జన సమీకరణపై పార్టీ నాయకత్వం ఇప్పటికే లక్ష్యాల్ని నిర్దేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories