Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Arun Chilukuri
Published on: 4 Oct 2023 4:13 PM IST
Union Cabinet Approves National Turmeric Board in Telangana
X

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రూ.889 కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యునివర్సిటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కృష్ణా వాటర్ వివాదాల పరిష్కారం కోసం కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు అనురాగ్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story