Bhadrachalam: ముళ్లపొదలో అప్పుడే పుట్టిన శిశువు.. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో దారుణం

* శిశువు ఏడుపులు గమనించిన స్థానికులు * భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలింపు * పాప కుడికన్ను, వీపు భాగంలో స్వల్పగాయాలు

Sandeep Reddy
Updated on: 14 Sept 2021 10:52 AM IST
Unidentified People Left the a New Born Baby Girl in the Bushes in Bhadrachalam
X

ఆడపిల్ల పుట్టిందనే కారణంతో దారుణం వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

Bhadrachalam: ఆడ పిల్ల పుట్టిందని ముళ్లపొదలో వదిలేసి వెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. పుట్టిన రెండు గంటల్లోనే శిశువుని భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ వెనుక రాత్రి 9గంటల సమయంలో చెత్త కుప్పలో పడేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే శిశువు ఏడుపులు వినిపించడం గమనించిన స్థానికులు వెంటనే పాపను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పాపకు చికిత్స అందించారు.

చెత్త కుప్పలో వేయడం వల్ల కుడికన్ను, వీపు వెనుక భాగంలో స్వల్పంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ ద్వారా భద్రాచలం పోలీసులకు, ICDS అధికారులకు సమాచారం ఇచ్చామని ఆ శిశువు తల్లిదండ్రులను గుర్తించే వరకు తమ సంరక్షణలోనే శిశువు ఉంటుందని చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story