Yellandu: ఇల్లెందులో అద్భుతం: 17 ఏళ్ల క్రితం ఖననం చేసినా.. చెక్కుచెదరని బాలిక మృతదేహం!

Yellandu: ఇల్లెందులో అద్భుతం: 17 ఏళ్ల క్రితం ఖననం చేసినా.. చెక్కుచెదరని బాలిక మృతదేహం!
x

Yellandu: ఇల్లెందులో అద్భుతం: 17 ఏళ్ల క్రితం ఖననం చేసినా.. చెక్కుచెదరని బాలిక మృతదేహం!

Highlights

Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మృతదేహాన్ని ఖననం చేసిన ఏడాదిలోపే అది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఇక్కడ 17 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఒక బాలిక మృతదేహం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే?

ఇల్లెందు నంబర్-2 బస్తీకి చెందిన అబ్దుల్ అజమ్ ఖాన్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని స్థానిక ఖబరస్థాన్‌లో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. 2009లో అనారోగ్యంతో మృతి చెందిన అజమ్ ఖాన్ అన్న కూతురు నస్రీన్ సమాధి పక్కనే ఆయనను కూడా ఖననం చేయాలని నిర్ణయించి గోతిని తవ్వడం ప్రారంభించారు.

షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు:

గోతిని తవ్వుతుండగా, పక్కనే ఉన్న నస్రీన్ మృతదేహం బయటపడింది. 17 ఏళ్ల క్రితం పదేళ్ల వయసులో మరణించిన ఆ బాలిక మృతదేహం ఏమాత్రం పాడవకుండా ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు.

వస్త్రం రంగు మారలేదు: శవంపై కప్పిన వస్త్రం (కఫన్) రంగు మారకపోవడమే కాకుండా, కనీసం చెదలు కూడా పట్టకపోవడం విశేషం.

దైవ మహిమగా భావన: ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు దీనిని దైవ మహిమగా భావించారు.

వెంటనే మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మృతదేహాన్ని మళ్ళీ యథావిధిగా ఖననం చేశారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం ఇల్లెందు నియోజకవర్గంలో దావాగ్నంలా వ్యాపించి, చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories