Srisailam: ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు..

Srisailam: వచ్చే నెల 6 నుంచి 10 వరకూ ఉగాది మహోత్సవాలు

Jyothi
Published on: 14 March 2024 3:14 PM IST
Ugadi Mahotsavam In Srisailam From April 6th
X

Srisailam: ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు..

Srisailam: శ్రీశైల క్షేత్రంలో వచ్చే నెల 6 నుంచి 10 వరకూ ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థాన పరిపాలన భవనంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థాన అన్ని విభాగాల అధికారులతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

ఉగాది మహోత్సవాలు సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది కృషిచేయాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచించారు. ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పరస్పర సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story