ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: సంతోష్‌ కుమార్‌ శాస్త్రి

Ugadi: ప్రగతిభవన్‌ లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 2 April 2022 12:44 PM IST
Ugadi Celebrations In Pragathi Bhavan
X

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: సంతోష్‌ కుమార్‌ శాస్త్రి 

Ugadi: ప్రగతిభవన్‌ లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎంకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రస్తుతం బాచుపల్లి సంతోష్‌ కుమార్ శాస్త్రీ పంచాగ పఠనం చేస్తున్నారు. చీకటిరోజులు తొలగిపోయి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో భూమండలమంతా అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయన్నారు.

ఈ ఏడాదంతా అందరూ ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రజారోగ్యం బాగుంటుదని, మాస్కులు అవసరం ఉండదన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. వేసవిలోనూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. జూలై నెల మధ్య నుంచి రైతులకు అద్భుతమైన కాలమని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story