Uddhav Thackeray-KCR: తెలంగాణ సీఎంకు మహారాష్ట్ర సీఎం ఫోన్

Uddhav Thackeray-KCR: ముంబైకి రండి చర్చిద్దామన్న సీఎం ఉద్దావ్ థాక్రే

Rama Rao
Updated on: 16 Feb 2022 1:20 PM IST
Maharashtra CM Uddhav Thackeray Phone to Telangana CM KCR
X

తెలంగాణ సీఎంకు మహారాష్ట్ర సీఎం ఫోన్

Uddhav Thackeray-KCR: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేసీఆర్‌కు మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాజాగా, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే కూడా కేసీఆర్‌కు మ‌ద్దతు తెలిపారు.

నిన్న కేసీఆర్‌కు ఉద్ధ‌వ్ థాక్రే ఫోన్ చేసిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నెల 20వ తేదీన ముంబై రావాల‌ని, అన్ని అంశాల‌పై చ‌ర్చిద్దామ‌ని కేసీఆర్ కు ఉద్ధ‌వ్ థాక్రే చెప్పారు. కేసీఆర్ పోరాడుతోన్న తీరు బాగుంద‌ని, తాము మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ఫోనులో ఉద్ధ‌వ్ థాక్రే చెప్పారు. కేసీఆర్‌ది న్యాయ‌మైన పోరాట‌మ‌ని అన్నారు. విభ‌జ‌న శ‌క్తుల‌పై పోరాటానికి గ‌ళం విప్పార‌ని, స‌రైన స‌మ‌యంలో కేసీఆర్ ముందుకు వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్రాల హ‌క్కుల కోసం పోరాటాన్ని కొన‌సాగించాల‌ని చెప్పారు. దేశ ప్ర‌జలంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ్లేందుకు తాము సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఉద్ధవ్ తెలిపారు. ఇద్ద‌రం స‌మావేశ‌మై రాజ‌కీయ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిద్దామ‌ని కేసీఆర్ తో ఉద్ధ‌వ్ అన్నారు.

దీంతో మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ దేశంలో ప‌లు ఎన్డీయేత‌ర పార్టీల‌తో చ‌ర్చించారు. ఎన్డీయే, యూపీఏతర కూట‌మి ఏర్పాటుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story