Hyderabad: మారేడ్‌పల్లిలో టైప్ రైటింగ్ టెస్ట్‌.. హాజరైన 800 మంది అభ్యర్థులు

Typewriting Test In Marredpally Hyderabad
x

Hyderabad: మారేడ్‌పల్లిలో టైప్ రైటింగ్ టెస్ట్‌.. హాజరైన 800 మంది అభ్యర్థులు

Highlights

Hyderabad: CBT విధానాన్ని తెలంగాణలో కూడా అమలు పరచాలి

Hyderabad: యువత సాంకేతికతతో పాటు నైపుణ్యాభివృద్ధిను కూడా పెంపొందించుకోవాలన్నారు తెలంగాణ టైప్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పొందేందుకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నైపుణ్యం దోహదపడుతుందని తెలిపారు. ఇవాళ మారేడ్‌పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో టైప్‌ రైటింగ్‌ పరీక్ష నిర్వహించగా.. 8 వందల మంది నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సిబిటి విధానాన్ని.. తెలంగాణలో కూడా అమలుచేయాలని ప్రభుత్వాన్న కోరారు తెలంగాణ రికగ్నైజర్ టైపు రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నామని.. వెంటనే ఆయన చొరవ తీసుకొని ఈ అంశంపై తమకున్న డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories