Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

Hyderabad: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం

Jyothi
Updated on: 7 Sept 2023 10:55 AM IST
Two People Dead After Wall of the Building Collapsed Under Construction in Hyderabad KPHB
X

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడగా.. వారిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. భవనంలోని 6వ అంతస్తులో పిట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పిట్టగోడతో పాటు సెంట్రింగ్ కర్రలు కూడా విరిగి కార్మికులు కింద పడిపోయారు.




Jyothi

Jyothi

Next Story