తూప్రాన్‌లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరి మృతి

Medak: విమానం కూలడంతో భారీగా చెలరేగిన మంటలు

Shekhar G
Published on: 4 Dec 2023 12:10 PM IST
Two Killed In Training Plane Crash In Medak District
X

తూప్రాన్‌లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరి మృతి

Medak: మెదక్ జిల్లాలో శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని రావెల్లి శివారులో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు శిక్షణ విమానం కూలింది. విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమైపోయింది. భారీ శబ్ధం విన్న స్థానికులు మంటల్లో కాలిపోతున్న విమానాన్ని చూసి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ ఇద్దరూ మృతి చెందారు. కూలిపోయిన ఫ్లైట్‌.. దుండిగల్‌ ఎయిర్‌పోర్టుకు చెందిన శిక్షణ విమానంగా గుర్తించారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story